నవతెలంగాణ-రంగారెడ్డి డెస్క్
ప్రతి ఒక్కరూ రక్త దానం చేసి ప్రాణ దాతలు కావాలని మహేశ్వరం డిపో మేనేజర్ ఎం.మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జ నార్ ఆదేశాల మేరకు మహేశ్వరం డిపోలో రక్తదాన శిబి రాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రతి ఒక్కరికీ సమాజం పట్ల సామాజిక సేవా దృక్ప థం కలిసి ఉండాలన్నారు. ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులు స్వచ్ఛందంగా 40 మంది పాల్గొని, రక్తదానం చేసి తమ సేవా భావాన్ని చాటారని అభినందించారు. ఈ కార్య క్రమంలో ఏఎంఎఫ్ ప్రకాశ్, అసిస్టెంట్ మేనేజర్ విజయకుమార్, ఆర్టీసీ వెల్ఫేర్ సభ్యులు కిషోర్, ప్రమీల ఉద్యోగులు పాల్గొన్నారు.