రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం..

నవతెలంగాణ – కంటేశ్వర్
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా జేసిఐ ఇందూర్ ఆద్వర్యంలో బుదవారం నిజామాబాదు నగరంలోని రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసిఐ పూర్వాద్యక్షులు పురుషోత్తం రెడ్డి, జోన్ ట్రైనర్ బంగారి విమల్ రాజ్, జెసిఐ సభ్యులు ఉత్తేజ్ తదితరులు రక్తదానం చేశారు. జేసిఐ ఇందూర్ అధ్యక్షులు జిల్కర్ నయన్, పూర్వాధ్యక్షులు జిల్కర్ విజయానంద్,బంగారి వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.రక్తదానానికి ముందుకు వచ్చిన జేసిఐ ఇందూర్ ప్రతినిధులను జేసిఐ జోన్ డైరెక్టర్ జయంత్ శెట్టి ఈ సందర్భంగా అభినందించారు.

Spread the love