కేసీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం 

నవతెలంగాణ – గోవిందరావుపేట
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదిన సందర్భంగా మండలంలోని పసర గ్రామంలో శనివారం బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాసచారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 47 మంది కార్యకర్తలు రక్తదానం చేసినట్లు శ్రీనివాస్ తెలిపారు. ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి కెసిఆర్ జన్మదిన సందర్భంగా మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాల వ్యవధిలో కేసీఆర్ అమలుపరిచిన అనేక సంక్షేమ పథకాలను కొనియాడారు. పుట్టినరోజు సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అమలుపరిచిన అనేక పథకాలను ఈ సందర్భంగా వల్లే వేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషిచేసి రాష్ట్రాన్ని సాధించిన ఘనుడు కేసీఆర్ అని నిండు నూరేళ్లు కలకాలం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు ఏకుల ధనంజయ  ఎంపిటిసి వెలిశాల స్వరూప, రాంనగర్ సర్పంచ్ మోహన్ రాథోడ్, మండల ప్రధాన కార్యదర్శి లాకావత్ నర్సింహా నాయక్, మండల ఉపాధ్యక్షుడు అజ్మీర సురేష్, గోవిందరావుపేట గ్రామ అధ్యక్షుడు అక్కినపల్లి రమేష్, బురెడ్డి మధుసూదన్ రెడ్డి, కృష్ణ,రవి, రాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love