నవతెలంగాణ – మంథని: మంథని బ్లడ్ బ్యాంకులో రక్త విలువలు లేని సందర్భంలో ఈ రక్తదాన శిబిరం ఎంతో ఉపయోగపడుతుందని ట్రస్ట్ సభ్యులు అన్నారు.సోమవారం పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ హాస్పిటల్ లో సహాయ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పెద్దపల్లి శాఖ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.మంథని బ్లడ్ బ్యాంక్ లో రక్త నిల్వలు లేని సందర్భంలో ఈ శిబిరం ఎంతో ఉపయోగపడుతుందని, యువకులు రక్తదానం చేయడంలో ముందుండాలని ట్రస్ట్ సభ్యులు అన్నారు.ఈ కార్యక్రమంలో సహాయ ట్రస్ట్ చైర్మన్ మేడగొని వెంకటేష్,వైస్ చైర్మన్ బొడ్డు సతీష్,కార్యదర్శి బుద్ధర్తి సతీష్ కుమార్,సభ్యులు ఐతుడేవిడ్, నార్ల విజయ భాస్కర్,కడియాలవేణు, రాజేందర్,డాక్టర్ అక్షయ్ కుమార్ పాల్గొన్నారు.