బీజేపీకి దెబ్బ మీద దెబ్బ..

– కమలం రేకులు రాలుతున్నాయి..!
– తుల ఉమా వికాస్ వర్గాల మధ్య అగ్గి రగులుకుంది..
– హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల నిరసన..
– టికెట్ వికాస్ కేటాయించాలని నినాదాలు..
– పార్టీ కండువాలు మార్చే వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని నిలదీత..
– బిఆర్ఎస్ కోవర్టుగా తుల ఉమా అని బిజెపిలో చర్చ..
నవతెలంగాణ – వేములవాడ : ఎన్నికల ముందు బీజేపీకి షాకులు మీద షాకులు తగులుతూనే ఉంది.. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర కార్యాలయంలో నిరసన, ధర్నాకు కూర్చున్నారు.. వేములవాడ బీజేపీ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తూ వికాస్ కు అనుకూలంగా నినాదాలు చేశారు.. వికాస్ మాత్రం పార్టీ నిర్ణయమే శిరోధార్యం అంటున్నారు..  రేపటి రోజుతో నామినేషన్ ప్రక్రియ  ముగియనుంది,ఆయన వర్గం మాత్రం తులా ఉమా టికెట్టు మార్చాలని వేములవాడ పార్టీ కార్యాలయంలో ప్లే కార్డ్స్ తో నిరసన చేస్తున్నారు.. బి ఆర్ఎస్, కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతుంటే బిజెపి కొట్లాటలతో సమయం వృధా చేస్తున్నారు, నియోజకవర్గంలో గెలిచే అభ్యర్థి వదిలి, ఓడి అభ్యర్థికి టికెట్ ఇచ్చారని తుల ఉమా, వికాస్ వర్గాల మధ్య అగ్గి రగులుకున్నట్లు అయింది.. బిజెపి పార్టీలో క్రమశిక్షణ, నిబద్ధత ,ముఖ్య నాయకులు ఆదేశాలకు అనుసరిస్తూ పనిచేసే కార్యకర్తలు అయోమయం. పార్టీలో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరు ఎప్పుడు పార్టీ కండువాలు మారుస్తారు తెలియక పార్టీ అధిష్టానానికి షాకులు ఇస్తూనే ఉన్నారు, దెబ్బ మీద దెబ్బ పార్టీ ఖండవలు మార్చడంతో కమలం రేకులు రాలుతున్నాయి..
పార్టీ వీడి కారెక్కుతున్న ప్రతినిధులు..
ఇప్పటికే వేములవాడలో 17వ కౌన్సిలర్ లావణ్య – శ్రీనివాస్, 26వ వార్డు కౌన్సిలర్ ముప్పిడి సునంద – శ్రీనివాస్ గత నెల అక్టోబర్ లో కేటీఆర్ సమక్షంలో రూరల్ ఎంపీపీ బండ మల్లేష్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోపు బాలరాజ్, జిల్లా నాయకులు గజ్జల రమేష్, సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు, ఎమ్మెల్యే అభ్యర్థి చెల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో రుద్రవరం ఎంపీటీసీ సువర్ణ – స్వామీలు బిజెపిని వీడి బీఆర్ఎస్  తీర్థం పుచ్చుకున్నారు. రోజురోజుకు పార్టీ క్యాడర్ ఎవరు ఎప్పుడు ఎటు పోతారు తెలియక నియోజకవర్గ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య వర్గ పోరుతో కార్యకర్తలు ఒక్కొక్కరిగా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు చేరుతున్నారు. నియోజకవర్గంలో అంతంతమాత్రంగానే ఉన్న ఓటు బ్యాంకు వర్గ విభేదాలతో ఉన్న కాస్త బిజెపి క్యాడర్  హుసురుమంటున్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య ఎన్నికల పోటాపోటీగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నాయి. బిజెపి 2009, 2010 ఎన్నికల్లో మూడో స్థానంలో నిలుస్తూనే వస్తుంది 2014 మాత్రం బిజెపి నుండి ఆది శ్రీనివాస్  ఎన్నికల్లో రెండవ స్థానంలో వచ్చింది.    2018 ఎన్నికల్లో డిపాజిట్ గల్లంతై మరల మూడో స్థానంలో నిలిచింది..
బిఆర్ఎస్ కోవర్టుగా తుల ఉమా అని బిజెపిలో చర్చ..
సర్వేలు అన్ని వికాస్ కాంగ్రెస్, బిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇస్తారని  సర్వేలో తేల్చాయని, పార్టీ కండువాలు మార్చి ఇతర పార్టీల నుండి వచ్చిన బిఆర్ఎస్ కువర్టుగా పనిచేసే వ్యక్తికి టికెట్ కేటాయించారని బిజెపి నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నారు.
గట్టి పోటీనిచ్చే వ్యక్తిని కాదని కనీసం  డిపాజిట్ రాని ఉమకు టికెట్ కేటా ఇస్తారా.. గత నెల అక్టోబర్ లో కేటీఆర్ పర్యటనలో భాగంగా చల్మెడ నివాసంలో నియోజకవర్గ మండల నాయకులతో బిజెపి నుండి తుల ఉమకు టికెట్ వస్తుంది, బీసీ బీసీలు కొట్లాడుకుంటే చల్మెడ  చాలా సులభంగా బయటపడతారని కథలాపూర్, మేడిపల్లి, భీమవరం మండల బిఆర్ఎస్ నాయకులకు కేటీఆర్ తెలిపినట్లుగానే తుల ఉమకు టికెట్ బిజెపి అధిష్టానం కేటాయించింది. నియోజకవర్గం లో బీసీ ఓట్లు ఎక్కువగా ఉండడంతో బీసీ ఓట్లు చీల్చి ఆది శ్రీనివాస్ విజయకు అడ్డుపడేలా ఇది బిఆర్ఎస్, బిజెపి పున్నాగమని వేములవాడలో జోరుగా చర్చ జరుగుతుంది, బిజెపి నిజమైన నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ కు కోవర్టు తుల ఉమా అని ఆరోపిస్తున్నారు, బిజెపి టికెట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎలా తెలుసు అని అంటున్నారు. బిజెపి క్యాండిడేట్  బిఆర్ఎస్ విజయం వరించేలా ఇది బిజెపి  స్కెచ్  అన్నట్లుగా అనుకుంటున్నారు.వికాస్ పోటీలో ఉంటే చెల్మెడ విజయం సాధ్యం కాదని ఇది పక్కా పన్నాగమే అని బిజెపి కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే తుల ఉమకు వేములవాడ పట్టణ బిజెపి నాయకులు ప్రచారంలో దూరంగా ఉంటూ వస్తున్నారు, కొందరు ఆమెతో పని చేయడం ఇష్టం లేక పార్టీలు మారుతున్నారు. వికాస్ గత నాలుగు సంవత్సరాల కాలంగా నియోజకవర్గంలో ప్రతిమ స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఉమ కంటే వికాస్ కు ఓటు బ్యాంక్ ,ప్రజల్లో జనాదరణ చాలా ఉందిఅని, బిజెపి కార్యకర్తలు, నాయకులు, జిల్లా అధ్యక్షులు ఉమ కు వ్యతిరేకంగా రాష్ట్ర నాయకత్వానికి టికెట్ వికాస్ కు కేటాయించాలని నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకటే.. బీఆర్ఎస్, కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే, బీజేపీకి ఓటు వేస్తే కారు గుర్తుకు ఓటి పడినట్లే అని జోరుగా ప్రచారం జరుగుతుందని రాష్ట్ర అగ్ర నాయకత్వానికి దృష్టికి తీసుకువెళ్లారు అని చర్చ జరుగుతుంది. గల్లీలో లొల్లి ఢిల్లీలో దోస్తీ అని ఇప్పటికే కాంగ్రెస్ జోరుగా రాష్ట్రంలో, నియోజకవర్గాలలో ప్రచారం చేస్తున్నారని తెలిపినట్లు సమాచారం. ఉమ కు కార్యకర్తలతో బిజెపి నాయకులతో విభేదాలు చాలు అనే కనిపిస్తున్నాయి ఆమెకు కథలాపూర్, మేడిపల్లి, భీమవరంలో యాదవ ఓట్ బ్యాంక్ తప్ప వేరే ఇతర మండలాల్లో ఓట్లు పడే అవకాశం లేదని మోస్తారు సంబంధాలే ఉన్నాయని అంత గుర్తింపు లేదని బిజెపిలో జోరుగా జరుగుతున్న చర్చ .ఆమె విజయానికి బిజెపి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు సహకరించడం లేదని ప్రజలు అనుకుంటున్నారు. ఉమా  సైతం ఓ సందర్భంలో బిజెపి నుండి టికెట్ రాకపోతే మీకు నచ్చిన వ్యక్తికి మీ ఓట్లు వేయవచ్చని బీజేపీలో గుసగుసలు.
Spread the love