– హెచ్‌సీఏకు బీసీసీఐ కార్యదర్శి హామీ
హైదరాబాద్: తెలంగాణ జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్దికి సహకారం అందిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియ హామీ ఇచ్చారు. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో శనివారం సైకియ సహా సీఈవో హేమంగ్ ఆమీన్‌లతో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాస్ భేటీ అయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో నూతనంగా నిర్మించే స్టేడియాలు, మౌళిక సదుపాయాల కల్పనకు బోర్డు నుంచి 50 శాతం నిధులను అందిస్తామని భరోసా అందించారు. రానున్న సీజన్‌లో భారత జట్టు మేనేజర్‌గా హెచ్‌సీఏ నుంచి అవకాశం ఇవ్వాలని కోరగా సైకియా సానుకూలంగా స్పందించినట్టు జగన్ తెలిపారు.