నవతెలంగాణ – అమరావతి: ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ ఆరో రోజుకు చేరుకుంది. ఇటీవల ముంచెత్తిన వరదల సమయంలో ఎగవ నుంచి కొట్టుకొచ్చిన పడవలు బ్యారేజీ గేట్లను ఢీకొట్టి ఆగిపోయాయి. ఒక్కోబోటు 40-50 టన్నులు ఉండడం, వాటిని ఒకదానికొకటి కలిపి కట్టేయడం వంటి కారణాలతో… దీని వెనక కుట్ర కోణం ఉందని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. మొత్తం ఐదు పడవలు బ్యారేజీ గేట్లను ఢీకొట్టాయి. గేట్లను ఢీకొట్టడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలన్న కుట్ర పన్నారని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. గేట్లను ఢీకొని ఆగిపోయిన బోట్లను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలి ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో వాటిని ముక్కలు చేసి తొలగించే ప్రయత్నం చేయగా అది కూడా ఫలించలేదు. దీంతో కాకినాడ అబ్బులు బృందం బోట్లకు ఇనుప రోప్‌లు కట్టి పొక్లెయిన్లతో పైకి లాగుతోంది. మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నా బోటు 20 మీటర్లు మాత్రమే కదిలింది. బోట్లు ఇసుకలో కూరుకుపోవడంతో తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది.
ప్రకాశం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న బోట్ల వెలికితీత పనులు
2:23 pm