నవతెలంగాణ – వేములవాడ
ఎస్సీ వర్గీకరణ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర టిఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ పిలుపుమేరకు ఆగస్టు 6,7వ తేదిన చలో ఢిల్లీ జంతర్ మంతర్ జరిగే మహా ధర్నాకు మాదిగలు అధిక సంఖ్యలో తరలి రావాలని టిఎమ్మార్పీఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బొడ్డు లచ్చయ్య పిలుపునిచ్చారు.మంగళవారం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులతో తిప్పాపూర్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కరపత్రాలు ఆవిష్కరించారు.ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు బొడ్డు లచ్చయ్య మాట్లాడుతూ వర్గీకరణకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ప్రభుత్వాలు వర్గీకరణ పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నాయాని మండిపడ్డారు. రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆగస్టు 6, 7వ తేదీన మహాధర్నా జరుగుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆనాడు సుష్మా స్వరాజ్ హైదరాబాద్ నడిబొడ్డున బహిరంగ సభలో 100 రోజులో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారు,పది సంవత్సరాలు గడిచిన నెరవేర్చలేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాదిగల సభను ఏర్పాటు చేసి ఎంతో ఆశతో ఎదురు చూసిన అందరిని నిరాశపరిచి, కమిటీ వేస్తామని నేటికీ వర్గీకరణ పట్ల ఊసే లేదన్నారు. మాదిగ ఉప కులాలకు మోసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ రానున్న పార్లమెంటు సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ జోగిని శంకర్, మాజీ వార్డ్ సభ్యులు రిక్షా రాజు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు సుంకపాక శ్రీనివాస్, ఎల శ్రీనివాస్, గుడిసె దేవయ్య, సుంకపాక తిరుపతి, సుంకపాక దేవరాజ్, మిడిదొడ్డి గంగరాజు, కొల్లూరి రాజు, అబ్బాస్, సుంకపాక ప్రశాంత్, యూత్ సభ్యులు కళ్లేపల్లి జగన్, బొడ్డు అభిషేక్, మెరుగు పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.