అభివృద్ధి పనుల కోసం మంత్రిని కలిసిన బోధన్ ఎమ్మెల్యే

నవతెలంగాణ- బోధన్ టౌన్
బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమెర్ నూతన సచివాలయంలో సోమవారం రోజున రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని కలిసి బోధన్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కోసం బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమెర్ కలవడం జరిగింది. తదనంతరం తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ని కలిసి గిరిజన తండా గ్రామపంచాయతీల్లో రోడ్లు మరియు మౌలిక సదుపాయాల కల్పన కోసం 11 కోట్లను మంజూరు చేయాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి మంజూరు కోసం హామీ ఇచ్చారు. మార్కెటింగ్ శాఖ అధికారులతో పలు అభివృద్ధి పనులకు నిధుల వినియోగార్థం మంజూరికై వినతి చేయనైనది, సానుకులంగా అధికారులు స్పందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్ పాల్గొన్నారు.
Spread the love