గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

నవతెలంగాణ – డిచ్ పల్లి

నిజామాబాద్ రైళ్వే పోలిస్ స్టేషన్ పరిధిలోని ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి నల్లవెల్లి గ్రామల మాద్య ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు ఇందల్ వాయి పోలిసులకు సమాచారం అందజేశారు. ఇందల్ వాయి ఇంచార్జీ ఎస్సై మనోజ్ కుమార్ సిబ్బంది తో కలిసి ఘటన స్థలానికి చేరుకుని ఘటన జరిగిన స్థలం రైల్వే పరిధిలో ఉండటం తో రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వ పోలిసులు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర మార్చురీకి తరలించారు.మృతుడి వివరాలు ఇంక తెలియరాలేదని స్థానికులు తెలిపారు.
Spread the love