నవతెలంగాణ-నకిరేకల్ : నకిరేకల్ నియోజకవర్గ సీపీఐ(ఎం) అభ్యర్థిగా కేతపల్లి మండలానికి చెందిన బొజ్జ చిన్న వెంకులు ను ప్రకటించింది. చిన్న వెంకులు 1987- 88 నుండి సీపీఐ(ఎం) పార్టీ సభ్యునిగా కొనసాగుతున్నారు. 1990 – 91లో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడిగా, 1993 నుండి 2000 వరకు రైతు సంఘం లో పనిచేశారు. 2001 నుండి 2006 వరకు ఇనుపాముల గ్రామపంచాయతీ సర్పంచ్ గా, 2010 నుండి పది సంవత్సరాలు కేతపల్లి మండల పార్టీ కార్యదర్శిగా పనిచేశారు. 2013 నుండి 2019 వరకు కేతపల్లి పిఎసిఎస్ చైర్మన్ గా కొనసాగారు. ప్రస్తుతం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడిగా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
1987-88 నుండి పార్టీ సభ్యునిగా కొనసాగుతూ
1990-91 ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు
1993 నుండి2000 వరకు రైతు సంఘంలో కొనసాగినారు
2001 నుండి2006 వరకు ఇను పాముల గ్రామపంచాయతీ సర్పంచి
2010 నుండి కేతేపల్లి పార్టీ మండల కార్యదర్శిగా కొనసాగినారు 10 సంవత్సరాలు
2013 నుండి2019 వరకు పిఎసిఎస్ చైర్మన్
ప్రస్తుతం పార్టీ జిల్లా కమిటీ సభ్యునిగా మరియువ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు