బాలీవుడ్ క్వీన్ షర్మిలా ఠాగూర్, కరీనా కపూర్ ఖాన్ ను ఒకే తాటిపైకి

నవతెలంగాణ – ఢిల్లీ: హోమ్ డెకార్ రంగంలో సరికొత్త సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమైంది మైట్రిడెంట్. అందులో భాగంగా మైట్రిడెంట్ కు సంబంధించి తాజా క్యాంపెయిన్ ను ప్రారంభించింది. అందరూ క్యాంపెయిన్ లు చేస్తారు. కానీ మైట్రిడెంట్ క్యాంపెయిన్ తోనే వండర్స్ క్రియేట్ చేసింది. అలనాటి అందాల తార షర్మిలా ఠాగూర్ మరియు బాలీవుడ్ సన్షేషన్ కరీనా కపూర్ ఖాన్ ను ఒకే స్క్రీన్ పైకి తీసుకొచ్చింది. ఈ క్యాంపెయిన్ లో పాత, కొత్త తరాలుగా ప్రతినిధులుగా అత్తా కోడళ్లైన షర్మిల, కరీనా కన్పిస్తారు. వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఈ క్యాంపెయిన్ మరింత హైలెట్ చేస్తుంది. ఈ క్యాంపెయిన్ క్రియేటివ్ కథనాల్లో కొత్త ప్రమాణాన్ని సెట్ చేస్తుంది. అన్నింటికి మించి ఆధునిక కుటుంబ సంబంధాల్లో రోజురోజుకి వస్తున్న మార్పుల్ని ఇది సూచిస్తుంది. పూర్తిస్థాయి లేటెస్ట్ సినిమాటిక్ టెక్నాలజీతో ఈ క్యాంపెయిన్ ను రూపొందించారు. పునీత్ మల్హోత్రా నేతృత్వంలో ధర్మ 2.0 ద్వారా నిర్మించబడిన ఈ క్యాంపెయిన్ టెలివిజన్ ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అన్నింటికి మించి ఇది కరీనా కపూర్ ఖాన్ మరియు షర్మిలా ఠాగూర్ మధ్య సున్నితమైన కెమిస్ట్రీని ప్రపంచానికి సరికొత్తగా తెలియచేస్తుంది. అద్భుతమైన గ్రేస్ మరియు లేటెస్ట్ ట్రెండ్స్ కు తగ్గట్లుగా రూపొందించిన మైట్రైడెంట్ యొక్క ప్రీమియం హోమ్ ఎసెన్షియల్స్.. ఐశ్వర్యం మరియు సౌకర్యాల మధ్య విలాసవంతమైన ఇంటిని అందిస్తుంది. ఈ అద్భుతమైన మరియి అనన్యసామాన్యమైన సహకారం వారిద్దరి గొప్పదనాన్ని చాటిచెప్పడమే కాకుండా.. మైట్రిడెంట్ యొక్క గొప్పతనానికి పర్యాయపదంగా మారుస్తుంది. అన్నింటికి మించి అద్భుతమైన డిజైన్, అందం మరియు నైపుణ్యానికి నిదర్శనంగా కూడా పనిచేస్తుంది. Link to the film:  https://www.instagram.com/reel/C6-jjPGIoj2/?igsh=MXN1aXNrZ3Y4dGR3OQ== “ఈ క్యాంపెయిన్ సమకాలీన భారతీయ కుటుంబం యొక్క గొప్పదనాన్ని చాటిచెప్తుంది. మూస పద్ధతులకు అతీతంగా అందరినీ కలుపుకుపోయేలా చేస్తుంది. కరీనా కపూర్ ఖాన్ మరియు షర్మిలా ఠాగూర్ యొక్క అధునాతనత, గాంభీర్యం మరియు ఎక్కువకాలం మన్నే మా బ్రాండ్‌ ను వినియోగదారులు చాలా తీక్షణంగా గమనిస్తారు. మైట్రిడెంట్ తాజా క్యాంపెయిన్ ద్వారా కరీనా కపూర్ ఖాన్ మరియు షర్మిలా ఠాగూర్‌ల సామరస్యపూర్వకమైన బంధం ద్వారా వారి ఇల్లు ఎలా అయితే ఆనందాలకు నిలయంగా మారిందో.. ఇప్పుడు మా హోమ్ డెకర్ ద్వారా ప్రతీ ఇల్లు చక్కదనం మరియు సౌలభ్యంగా ఉండేందుకు అవకాశం ఉందని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము. వారి బంధాల్ని చూసి మనం కూడా మన జీవన ప్రదేశాలను క్యూరేట్ చేసుకోవచ్చు ” అని అన్నారు మైట్రైడెంట్ చైర్‌పర్సన్ నేహా గుప్తా బెక్టర్.
“ఈ క్యాంపెయిన్ కోసం షర్మిలా ఠాగూర్‌తో కలిసి పని చేయడం చాలా సంతృప్తికరమైన అనుభవం. మేమిద్దరం కలిసి, మా యొక్క కుటుంబ బంధాల సారాంశాన్ని మరియు లోతుగా ప్రతిధ్వనించే మైట్రైడెంట్ బ్రాండ్‌తో కలిసి ఇంట్లో పంచుకున్న క్షణాల అందాన్ని జరుపుకోవడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ క్యాంపెయిన్ ద్వారా భారతదేశంలోని కుటుంబాల్లో ప్రేమ, గౌరవం మరియు సామరస్యాన్ని స్వీకరించడానికి మేము నిజంగా ఇష్టపడే మరియు ఆరాధించే బ్రాండ్ ఇది అని అన్నారు కరీనా కపూర్ ఖాన్. హోమ్ డెకర్ ఇండస్ట్రీలో సరికొత్త ఆవిష్కరణల ద్వారా కొత్త పుంతలు తొక్కడం, అలాగే క్యాంపెయిన్ ద్వారా అత్తాకోడళ్ల మధ్య బంధాన్ని హైలెట్ చేయడం, అన్నింటికి మించి మా ఉత్పత్తుల్లో వైవిధ్యాన్ని చాటిచెప్పడం మరియు అవి అందరికీ చెందినవనే భావాన్ని బలంగా అర్థమయ్యేలా చెప్పడం మా అంకితభావానికి నిదర్శనం. లగ్జరీ మరియు ప్రీమియం గృహోపకరణాలలో అత్యంత ఇష్టపడే బ్రాండ్‌లలో ఒకటిగా, మైట్రైడెంట్ సమకాలీన భారతీయ గృహాల యొక్క ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడంలో ముందుంది. మైట్రిడెంట్ యొక్క విస్తారమైన కలెక్షన్.. ఇంటిలోని ప్రతి చోట అందంగా ఉండి.. ఇంటిని మరింత అందంగా మారుస్తాయి. ఇంటిలోని ప్రతి సభ్యుడు మైట్రిడెంట్ హోమ్ డెకర్ ఉత్పత్తుల ద్వారా తమ ఇల్లు మునుపటికంటే సరకొత్తగా, అందంగా ఇంకా చెప్పాలంటే అందమైన అభయారణ్యంలా ఉందని కచ్చితంగా భావిస్తారు. ఈ వినూత్న ప్రచారం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సెట్ చేయబడింది. కుటుంబ బంధాల అందాన్ని స్వీకరించడానికి మరియు వారి ప్రేమ మరియు సామరస్యానికి నిజమైన ప్రతిబింబంగా ఉండే గృహాలను సృష్టించడానికి ప్రేరేపిస్తుంది. ఇవాళ, ఈ క్యాంపెయిన్ టెలివిజన్‌లోని ప్రముఖ వార్తా ఛానెల్‌లు, ప్రముఖ డిజిటల్ మీడియా అవుట్‌లెట్‌లు మరియు విస్తృతమైన సోషల్ మీడియా సిండికేషన్‌లతో సహా అనేక ప్రతిష్టాత్మక ప్లాట్‌ఫారమ్‌లలో విస్తరించింది. ఇంకా, గౌరవనీయమైన ప్రీమియం మరియు లగ్జరీ ప్లాట్‌ఫారమ్‌లతో వ్యూహాత్మక భాగస్వామ్యం మా సందేశాన్ని మరింతగా విస్తరింపజేస్తుంది. ఈ విస్తారమైన డిజిటల్ రంగంలో అద్భుతంగా ఇంతవరకు ఎవ్వరూ రూపొందించని విధంగా తెరకెక్కించిన ఈ క్యాంపెయిన్ ద్వారా ఉత్తర భారతదేశంతో పాటు పశ్చిమ భారతదేశంలూ ప్రతీ ఒక్కరికీ, ప్రతీ ఒక్క ప్రాంతానికి విస్తృతమవుతుంది. అన్నింటికి మించి సృజనాత్మక నైపుణ్యం మరియు ప్రభావవంతమైన సందేశంతో ప్రేక్షకులను ఆకర్షిస్తుంది ఈ క్యాంపెయిన్.

Spread the love