బీఓఎం వార్షికోత్సవ వేడుకలు

BOM Anniversary Celebrationsవిజయవాడ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర (బీఓఎం) 89వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను విజయవాడ జోనల్‌ ఆఫీసులో నిర్వహించారు. ఇటీవల ఈ వేడుకను జోనల్‌ మేనేజర్‌ జీఎస్‌డీ ప్రసాద్‌, డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ రజిని కుమార్‌ లాంచనంగా ప్రారంభించారని బీఓఎం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్బంగా మిత్రా హాస్పిటల్స్‌, న్యూసిటీ బ్లడ్‌ బ్యాంక్‌తో కలిసి మెడికల్‌ చెకప్‌, రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తమ బ్యాంక్‌ సిబ్బంది రక్తదానం చేశారు. వివిధ శాఖలకు చెందిన ఖాతాదారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఖాతాదారులే తమ బ్యాంక్‌ను ఉన్నత స్థానంలో నిలిపుతున్నారని జిఎస్‌డి ప్రసాద్‌ అన్నారు. మరింత మెరుగైన సేవలను అందించడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్‌ జోనల్‌ ఆఫీసు స్టాఫ్‌, నగరంలోని పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love