బెంగళూరులో బాంబు పేలుడు..హైదరాబాద్ లో అలర్ట్..!

నవతెలంగాణ-హైదరాబాద్ :  కర్ణాటక రాజధాని బెంగళూరులో పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అలర్ట్ అయ్యారు. సిటీలో హై అలర్ట్ ప్రకటించారు. స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులను అప్రమత్తం చేశామని.. సున్నిత ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నట్లు సిటీ పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. తాజాగా బెంగళూరు కేఫ్‌ పేలుడు కారణాల గురించి ఆరా తీస్తున్నామన్నారు. శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరు కుండలహళ్లిలోని ఫేమస్‌ రామేశ్వరం కేఫ్‌ వద్ద టిఫిన్‌ బాక్స్‌ బాంబ్‌తో ఆగంతకులు బ్లాస్ట్‌ జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. IEDతో పేలుళ్లు జరిపారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక పేలుడు ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. బాంబు పేలుళ్ల ఘటనపై దర్యాప్తున‌కు ఆదేశించారు సీఎం సిద్ధరామయ్య.

Spread the love