నవతెలంగాణ – హైదరాబాద్: ఇవాళ తెల్లవారుజామున ఢిల్లీ నుంచి వారణాసికి వెళ్లే ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఆ తర్వాత ప్రయాణికులను ఎమర్జెన్సీ డోర్ ద్వారా ఖాళీ చేయించిన సిబ్బంది.. దర్యాప్తు కోసం విమానాన్ని ఐసోలేషన్ బేకు తరలించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఏవియేషన్ సెక్యూరిటీ, బాంబు నిర్వీర్య బృందంతో పాటు క్విక్ రియాక్షన్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.