తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు: ఎమ్మెల్యే పోచారం

Bonals are a symbol of Telangana culture: MLA Pocharam– బీర్కూర్ గ్రామ అభివృద్ధికి కృషి 
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్న బోనాలు సాంప్రదాయానికి నిదర్శనంగా నిలుస్తుందని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల బాలరాజ్ అన్నారు. మంగళవారం బీర్కూర్ మండల కేంద్రంలో గ్రామస్తులు ఘనంగా నిర్వహించిన బోనాల జాతర సందర్భంగా ముఖ్యఅతిథిగా మాజీ స్పీకర్ పోచారం, రాష్ట్ర ఆగ్రో సమస్త చైర్మన్ కాసుల బాలరాజ్ రాక సందర్భంగా వారికి ఘన స్వాగతం పలికారు, బీర్కూరు గ్రామానికి రాక సందర్భంగా  ఇరువురికి గ్రామస్తులు ఘనంగా సన్మానించారు, గ్రామ దేవత వద్ద నిర్వహించిన బోనాలను మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో సంస్థ చైర్మన్ కాసుల బాలరాజ్ బోనాలను ఎత్తుకొని ఊరేగించారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామదేవతలను తమ ఇంటి ఆడపడుచుగా భావించి పూజించే విశిష్టమైన సంప్రదాయం కేవలం తెలంగాణకే సొంతం అన్నారు. ఆషాఢమాసంలో అమ్మవార్లు తమ పుట్టింటికి వస్తారని ప్రజల విశ్వాసం అన్నారు. ఆషాడమాసంలో నీటి కాలుష్యంతో వ్యాధులు, రోగాల బారిన పడకుండా, తమను కాపాడాలని అమ్మవారికి ప్రతిరూపాలైన గ్రామదేవతలు పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మలకు బోనాలు నివేదిస్తారని అన్నారు.  పల్లె, పట్నం అనే తేడా లేకుండా తెలంగాణలోని ప్రతీ ప్రాంతంలో బోనాల పండుగ చేస్తారని. ఈ పండుగ నిర్వహించుకోవడం ఒక ఆచారంగా వస్తోంది. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలతో నిర్వహించే మహిళల బోనాల ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణ పోతురాజులదే. పోతురాజు అంటే, అమ్మవారి తమ్ముడు అని ప్రజల నమ్మకం. పసుపు, కుంకుమలను ఒక్కచోట కలిపి, బోనాల పండగకు వచ్చిన భక్తులందరికీ తిలకంగా పూస్తారని అన్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో ఉన్న గ్రామ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని అలాగే నేడు ముఖ్యమంత్రి సహాయ నిధి మరియు డబుల్ బెడ్ రూమ్ లా చెక్కుల పంపిణీ చేయడం జరిగిందన్నారు అలాగే సంక్షేమ పథకాలు సంబంధించి లబ్ధిదారులకు వచ్చేలా చూస్తానన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి రెండో విడత రుణమాఫీ చేయడం గొప్ప విషయం అన్నారు. రైతులకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతి రైతు పాలాభిషేకం చేసి వారిని ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు దామరంచ శంకర్, సానిపు గంగారం, రాజు పటేల్, మన్నాన్, గంగాధర్, అప్ప రావు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love