బోనమెత్తిన పల్లెలు..

– మండలంలో ఘనంగా బోనాల వేడుకలు
నవతెలంగాణ పెద్దవంగర: బోనాల పండుగను మండల ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఉన్న గ్రామ దేవతలకు ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం కావడంతో బుధవారం అన్ని గ్రామాల్లో బోనమెత్తారు. ఇంటికి ఒక్క బోనం చొప్పున మహిళలు తీసుకవచ్చి గ్రామస్థులందరూ ఒక్క చోట కలిసి, బోనాలను ఊరేగింపుగా గ్రామ దేవతల వద్దకు తీసుకవచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని అమ్మవార్లను మొక్కుకున్నారు. వర్షాలు సమృద్ధిగా పడి పంటలు పండాలని.. పశు, పక్షాదులు, పిల్లా పాపలు సల్లంగా ఉండాలని అమ్మవార్లను వేడుకున్నారు. ఎంపీపీ ఈదురు రాజేశ్వరి ఐలయ్య, జెడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయి సుధీర్, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ మండల ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సై రాజు ఆధ్వర్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
Spread the love