బద్ది పోచమ్మకు బోనాలు..

నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం,  పట్టణ నాయి బ్రాహ్మణ సెలూన్ షాప్ యూనియన్(సెటిలర్స్ )ఆధ్వర్యంలో బద్ది పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్,బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగారం వెంకటస్వామి కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం మహిళలు బోనాలను డప్పు సప్పులతో ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ.. అందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో బద్ది పోచమ్మ అమ్మవారు  చూడాలని వారు ఆకాంక్షించారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆ అమ్మవారిని వేడుకున్నారు. నాయి బ్రాహ్మణ కులస్తులు వృత్తిపై జీవించేవారు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారికి వృత్తిలో ఇంకా వారికి బలం చేకూర్చేటట్టు చూడాలని ఆ అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్,  పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, నాగుల రాము గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు పోతుగంటి వెంకన్న, వేములవాడ పట్టణ నాయి బ్రాహ్మణ సెలూన్ షాప్ అధ్యక్షులు గడ్డం నవీన్, ఉపాధ్యక్షులు సారాంపల్లి సంతోష్, ఇన్నారం రమేష్, ప్రధాన కార్యదర్శి గంగ పెల్లి చిరంజీవి, ఉప కార్యదర్శి అమృత అనిల్, కోశాధికారి వెలిశాల శ్రీకాంత్,  కార్యవర్గ సభ్యులు గడ్డం రాజు, తంగళ్ళపల్లి భూమేష్, ఇన్నారం సాగర్, రవి,శ్రీనివాస్,తిరుపతి,పట్టణ నాయి బ్రాహ్మణ సభ్యులు తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love