ఐదే ఐదు నిమిషాల్లో 10 వేల స్టూడెంట్ వీసా స్లాట్ల బుకింగ్..

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది. విద్యార్థులకు ఆ దేశం జారీ చేసే స్టూడెంట్ వీసా (ఎఫ్-1) లకు డిమాండ్ చాలా ఎక్కువ. దీంతో వాటి కోసం విడుదల చేసే ఇంటర్వ్యూ స్లాట్ లకూ విపరీతమైన డిమాండ్ నెలకొంది. సోమవారం ఎఫ్-1 వీసా స్లాట్లు ఆన్ లైన్ లో విడుదల చేయగా.. కేవలం ఐదు నిమిషాల్లోనే ఏకంగా పదివేల స్లాట్లు బుక్ అయ్యాయి. దీంతో అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్న విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే యూనివర్సిటీల అడ్మిషన్ సంపాదించిన పలువురు విద్యార్థులు.. ఎఫ్-1 వీసా ఇంటర్వ్యూ కోసం స్లాట్ బుక్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది విద్యార్థులు ఏకంగా ఆరు నెలల నుంచి వీసా ఇంటర్వ్యూ కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. వీసా స్లాట్లు విడుదల చేసిన ప్రతిసారీ నిమిషాల వ్యవధిలోనే బుక్ అవుతున్నాయని చెబుతున్నారు.

Spread the love