బూత్ లెవల్ అధికారులు విధులు సమర్థవంతంగా నిర్వహించాలి

ఎంపీడీఓ.. దీన దయాళ్
నవతెలంగాణ -పెద్దవూర: బూత్ లెవల్ అధికారులు శిక్షణ ను సద్వినియోగం చేసుకొని, విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఎంపీడీఓ రమేష్ దీన దయాళ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఎంపీఓ విజయకుమారీ ఆధ్వర్యంలో బూత్ లెవల్ అధికారులకు చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో సూచనలు చేశారు. ఎలక్టోరల్ రోల్ తయారులో బూత్ స్ధాయి అధికారులు కీలక పాత్ర ఉంటుందన్నారు. క్రొత్తగా ఓటరు జాబితాలో చేరే వారికి ఫారం-6, తొలగింపుకు ఫారం-7, తప్పుల సవరణకు ఫారం-8 ఇవ్వడం  చేయాలన్నారు. అర్హులందరు ఓటు నమోదు చేసుకునేలా చూడడం, ఓటరు జాబితా ప్రదర్శన, పోలింగ్ కేంద్రాల మార్పుకు సహకరించడం బూత్ స్థాయి అధికారుల బాధ్యత అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి డాకు నాయక్, ఉపాధి సిబ్బంది శ్రీను, ఎఎన్ఎం లు విజయలక్ష్మి, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.

Spread the love