ఎంపీటీసీ నిధులతో బోరు మోటర్ బిగింపు

నవతెలంగాణ-భిక్కనూర్
మండల కేంద్రంలో కురుమ సంఘం స్థలం వద్ద ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సహకారంతో బోరు మోటర్ బిగించడం జరిగిందని సర్పంచ్ వేణు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంపీటీసీ బండి చంద్రకళ రాములు ఎంపీటీసీ నిధుల ద్వారా బోరు మోటర్ బిగించడం జరిగిందని, గ్రామాలు, సంఘాల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వ విప్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్, ఎంపీటీసీ సువర్ణ ప్రభాకర్, కురుమ సంఘం అధ్యక్షులు యాదయ్య, బీరయ్య, వార్డు సభ్యులు, సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love