బోర్ వెల్ లారీ, ద్వీచక్ర వాహనం ఢీ.. ఒకరి మృతి

నవతెలంగాణ – జుక్కల్

మండల కేంద్రంలోని జుక్కల్ – పెద్ద ఎడ్గి వెళ్లే రెండువరుసల రోడు పైన మండల పరిషత్ కార్యాలయము ఎదురుగా బోర్ వెల్ లారీ, ద్విచక్రవాహనం  బలంగా ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడని ఎస్సై సత్యనారాయణ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన గ్యాయికాడ్ మారుతీ వయస్సు సుమారుగా (45) సంవత్సరాలు ఉన్నాయి. మృతునికి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు.  కేసు నమేాదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహన్ని బాన్సువాడ ఎరియా ఆసుపత్రికి పంపించామని ఎస్సై సత్యనారాయణ తెలిపారు.
Spread the love