బోరు తవ్వకాల పనులు ప్రారంభం

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రామమందిరం వద్ద బోరు తవ్వకాల పనులను ఎంపీటీసీ లావణ్య రవి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సహకారంతో నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశానుసారం ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్ నిధుల నుండి ఒక లక్షా 30వేల రూపాయలు నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు.గత కోన్ని రోజుల క్రితం ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే దృష్టికి బోరు మోటారు విషయం తిసుకుని వేళ్ళగా వెంటనే స్పందించి నిధులు మంజూరు చేసినందుకు గ్రామస్తుల నుండి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు పిండి గంగాధర్, సొసైటీ డైరెక్టర్ రాంరెడ్డి, రాజు, గణేష్, రాకేష్,రాజ్ కూమార్, కుమ్మరి శ్రీను, వీడీసీ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.