వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు మృతి

Boy died due to negligence of doctors– వైద్యుల నిర్లక్ష్యం.. కుటుంబ సభ్యుల ఆందోళన
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
వైద్యుల నిర్లక్ష్యంతో ఓ పసి బాలుడు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో చోటు చేసుకుంది.  వైద్యుల నిర్లక్ష్యం వల్ల  బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మంగళవారం చోటుచేసుకుంది. పిట్లం మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన శంకర్, కృష్ణవేణి దంపతుల కుమారుడు హేమంత్(3)కు తీవ్ర జ్వరం రావడంతో సోమవారం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. కేవలం గ్లూకోజ్ పెట్టి వదిలేశారని, ఎలాంటి చికిత్స చేయలేదని తండ్రి ఆరోపించారు. రాత్రి వైద్యులెవరు పట్టించుకోకపోవడంతో మంగళవారం ఉదయం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లామన్నారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ సంద్భంగా ఆస్పత్రి సూపర్ డెంట్ డాక్టర్ విజయ లక్ష్మి మాట్లాడుతూ హేమంత్ ను వారి తల్లిదండ్రులు సోమవారం ఆస్పత్రికి తీసుకొచ్చారు. గత రెండు మూడు రోజులుగా పలు ప్రయివేటు ఆస్పత్రిలో చూపించారు. అయినా తక్కువ కాకపోవడంతో ఇక్కడికి తీసుకొచ్చారు. అలాగే మంగళవారం ఉదయం 4 గంటలకు డిచ్చర్జ్ అయ్యారు. అలాగే బాన్సువాడ ఓ ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు సమాచారం. బైట మృతి చెందిన బాలుడిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చి ఆందోళన చేస్తున్నారని, ఇక్కడే ఉంటే మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంకు తరలించేవారమని వారు తెలిపారు.
Spread the love