వినాయకుడి మండపం వద్ద విద్యుత్ వైర్లు తగిలి బాలుడి మృతి

నవతెలంగాణ – యాదాద్రి భువనగిరి: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వినాయకుడి మండపం వద్ద విద్యుత్ వైర్లు తగిలి బాలుడి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మతుర్కపల్లి మండలం దత్తాయిపల్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆదిత్య (6) అనే బాలుడు వినాయకుడి మండపం వద్ద అన్నదానం చేస్తున్న సమయంలో ప్రమాదవాశాత్తు విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లి దండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, అనుమతి లేకుండా ఇష్టానుసారంగా గణేష్‌ మండపాలను ఏర్పాటు చేయడం, తగు జాగ్రత్తలు తీజుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించారు.

Spread the love