తెలంగాణలో పలు గ్రామాల్లో పోలింగ్ బహిష్కరణ

నవతెలంగాణ హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించలేదన్న కారణంతో తెలంగాణలోని పలు గ్రామాల్లో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. ఎన్‌ఎస్పీ కాలువపై వంతెన నిర్మించలేదంటూ ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రాయమాదారంలో గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించి నిరసన తెలిపారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామస్థులు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఇక్కడి రైతులు ధర్నా చేపట్టారు. స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటు వేస్తామని పోలింగ్‌ కేంద్రం వద్ద నిరసన చేపట్టారు. తమ ఊరి రోడ్డు సమస్యను తీర్చలేదని ఆందోళన వ్యక్తం చేస్తూ… కడెం మండలం అల్లంపల్లిలో గ్రామస్థులు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లలేదు. మైనింగ్‌ ఎన్‌వోసీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూర్‌ మండలం మైలారంలో గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు.

Spread the love