ఒగ్గు కళాకారుల నేపథ్యంలో ‘బ్రహ్మాండ’

'Brahmanda' in the background of an artistఆమని ప్రధాన పాత్రధారిణిగా రూపొందిన చిత్రం ‘బ్రహ్మాండ’. మమత ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను నిర్మాత మిర్యాల  రవీందర్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ,’నా ‘అఖండ’ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ఈ సినిమా కూడా అంతటి విజయాన్ని అందుకుంటుంది. టీజర్‌, డిజైన్స్‌ చూశాను చాలా బాగా ఉన్నాయి’ అని తెలిపారు. ‘సినిమా అద్భుతంగా వచ్చింది’ అని నిర్మాత దాసరి సురేష్‌ చెప్పారు. దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ,’మొట్టమొదటిసారిగా ఒగ్గు కళాకారుల నేపథ్యంలో, వారి సంస్కతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న చిత్రం ఇది’ అని తెలిపారు.

Spread the love