నవతెలంగాణ- నసురుల్లాబాద్
తల్లి పాలు బిడ్డకు అమృతం. బిడ్డకు ముర్రుపాలు పట్టించడంతో వ్యాధి నిరోధకశక్తి పెరగడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడని అంగన్ వాడి ఐసిడిఎస్ సూపర్ వైజర్ వాణి తెలిపారు. శుక్రవారం నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మన్ దేవ్ పల్లి అంగన్ వాడి భవనంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు అలాగే పిల్లల తల్లులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్ వైజర్ వాణి, గ్రామ సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ.. తల్లి పాలును మించిన ఆహారం మరొకటి లేదన్నారు. పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రు పాలు పట్టించాలన్నారు. తల్లి పాలలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి సిబ్బంది, గర్భిణులు, తదితరులు హాజరయ్యారు.