మంత్రి ఎర్రబెల్లి చొరవతో బ్రిడ్జి నిర్మాణ పనులు

నవతెలంగాణ-పాలకుర్తి
శాతాపురం, దుబ్బ తండ (ఎస్పీ) గ్రామాల ప్రజల కల నెరవేరింది. రా ష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కృషితో 12 సంవత్స రాల నిరీక్షణకు తెరపడిం ది. స్టేషన్‌ ఘన్పూర్‌ నుం డి మండలంలోని చెన్నూరు రిజర్వాయర్‌కు వెళ్లే జే చొక్కా రావు దేవాదుల ప్రధాన వరద కాలువ తవ్వకాల్లో శాతాపురం, దుబ్బ తండా (ఎస్పీ) గ్రామాలతో పాటు ఆ వాస తండాలకు బ్రిడ్జి సౌకర్యం లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదు ర్కొన్నారు. శాతాపురం రైతులు వ్యవసాయ పనులకు వెళ్లాలన్న, దుబ్బతండా ఎస్పీ తోపాటు లోతువర్రెతండా, కేవులతండా ప్రజలు అత్యవసరాలకు పట్టణ ప్రాంతా లకు వెళ్లాలన్న సుమారు కిలోమీటర్‌ నడవాల్సిన పరిస్థితితో ప్రజలు ఇబ్బందులు పడేవారు. బ్రిడ్జి నిర్మాణం కోసం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావును ప్రజలు పలు మార్లు కలిసి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని విన్నవించుకున్నారు. స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కాంట్రాక్టర్‌ సుమన్‌ రావుకు బ్రిడ్జి నిర్మాణ పనులు చేప ట్టాలని ఆదేశించడంతో పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించారు. బ్రిడ్జి ని ర్మాణ పనులు చివరి దశకు చేరడంతో ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు, తం డావాసులు మంత్రి ఎర్రబెల్లికి కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love