చురులో బృందాకరత్‌ ప్రచారం

చురులో బృందాకరత్‌ ప్రచారంజైపూర్‌ : రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. సోమవారం రాజ్‌గఢ్‌ జిల్లాలోని చురు పట్టణంలో సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యురో సభ్యులు బృందాకరత్‌ ప్రచారం నిర్వహించారు. భారీ బహిరంగ సభలో బృందాకరత్‌ ప్రసంగిస్తూ చురు నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న సీపీఐ(ఎం) అభ్యర్థి సునీల్‌ పునియాకు ఓటు వేయమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశానికి సీపీఐ(ఎం) నాయకులు మైచంద్‌ బాగోరా అధ్యక్షత వహించారు. ఈ సభలో కేంద్ర కమిటీ సభ్యులు విక్రమ్‌ సింగ్‌, రాజ్‌గఢ్‌ జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి నిరుపమ్‌ కుమార్‌, అభ్యర్థి సునీల్‌ పునియా కూడా ప్రసంగించారు. ఈ సభకు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రాజస్థాన్‌లో ఈ నెల 25న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.

Spread the love