బ్రిటన్‌ హౌం మంత్రికి ఉద్వాసన

– విదేశాంగ శాఖ మంత్రిగా మాజీ ప్రధాని కెమరాన్‌
– సునాక్‌ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
లండన్‌: అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిళ్లు పెరుగుతుండడంతో బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తన క్యాబినెఉట్‌ సహచరిణి, హోం మంత్రి సుయెల్లా బ్రేవర్‌మన్‌కు ఎట్టకేలకు ఉద్వాసన పలికారు. పాలస్తీనాకు సంఘీభావంగా లండన్‌లో నిర్వహించిన భారీ ర్యాలీని నిర్దాక్షిణ్యంగా అణచివేయకుండా పోలీసు అధికారులు పక్షపాతంతో వ్యవహరించారంటూ నోరుపారేసుకున్న ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రతిపక్ష పార్టీలతో సహా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరిగింది. మొదట్లో ఆమెను వెనకేసుకొచ్చిన ప్రధాన మంత్రి చివరికి సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు రావడంతో ఉద్వాసన పలకక తప్పలేదు.

Spread the love