తమ్ముని కిరాతంగా హత్య చేసిన అన్న

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని సొనాలా గ్రామంలో తమ్ముని కి అన్న కిరాతంగా హత్య చేశాడు ఈ హత్యకు కారణం ఆస్తి తగాదాలే అంటున్న పోలీసులు హత్యకు గురైన టాక్లే విజయ్ బీఆర్ఎస్ పార్టీ సోనాల గ్రామ అధ్యక్షులు పార్టీ నాయకుని హత్య సమాచారాన్ని తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు షిండే హుటా హుటిన సోనాల గ్రామాన్ని సందర్శించారు నాయకుని హత్య గురించి గ్రామంలో ప్రజలతో అడిగి తెలుసుకున్నారు. చివరగా నాయకుని అంత్యక్రియల్లో పాల్గొని ఎమ్మెల్యే మృతుని పాడే మోశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రావడం నాయకుని హత్యపై ఆరా తీయడం పాడే మోయడం ఎమ్మెల్యే పనితీరుపై పార్టీ నాయకులు గ్రామస్తులు సంతోషం వ్యక్తపరిచారు కార్యకర్తకు అండగా ఉండటం అన్నదే పాడే మోసిన ఎమ్మెల్యే తీరు కు ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. ఏది ఏమైనా నాయకుని అత్యపై ఎమ్మెల్యే సీరియస్గా ఉన్నట్లు తెలిసింది సోనాల గ్రామంలో జరిగిన హత్య సమాచారాన్ని తెలుసుకున్న బిచ్కుంద సీఐ కృష్ణ బాన్స్వాడ డి.ఎస్.పి సోనాల గ్రామాన్ని సందర్శించారు, మద్నూర్ ఎస్సై కృష్ణారెడ్డి వివరాల ప్రకారం టాక్లే విజయ్ కి అతని అన్న తాకలే రాజు కత్తితో పొడిచి కిరాతంగా హత్య చేశాడని దీనికి కారణం ఆస్తి తగాదాలేనని తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విలేకరులకు తెలిపారు.

Spread the love