రేపు బీఆర్‌ఎస్‌ ఏపీ కార్యాలయం ప్రారంభం

నవతెలంగాణ – హైదరాబాద్‌: భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్‌ నూతన కార్యాలయాన్ని ఆదివారం గుంటూరులో ప్రారంభించనున్నారు. మంగళగిరి రోడ్డులో ఐదంతస్థుల భవనాన్ని పార్టీ కోసం తీసుకున్నారు. తొలి రెండు అంతస్థులు కార్యకర్తల సమావేశ మందిరాలు ఉండగా, మూడు, నాలుగు అంతస్థుల్లో నేతల క్యాబిన్లు, ఐదో అంతస్థులో రాష్ట్ర అధ్యక్షుడి కార్యాలయం ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున తరలిరావాలని ఏపీ అధ్యక్షుడు డాక్టర్‌ తోట చంద్రశేఖర్‌ పిలుపునిచ్చారు.

Spread the love