బీఆర్ఎస్ చలో మేడిగడ్డ కార్యక్రమం మార్చి నుంచి: కేటీఆర్

నవతెలంగాణ – హైదరాబాద్ :  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు మార్చి ఒకటి నుంచి ఛలో మేడిగడ్డ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు ప్రకటించారు. దాదాపుగా 150 – 200 మంది బీఆర్‌ఎస్‌ ప్రతినిధులతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ భవన్‌ నుంచి మేడిగడ్డ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలిరోజు కాళేశ్వరం వెళ్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని తెలంగాణ ప్రజలతో పాటు ఆరోపణలు చేస్తున్న వారికి చూపిస్తామన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకే మేడిగడ్డకు వెళ్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం అంటే ఏంటో సజీవంగా చూపిస్తామన్నారు. విడతల వారీగా కాళేశ్వరం ప్రాజెక్టును సమగ్రంగా సందర్శిస్తామన్నారు.

Spread the love