బిజెపిలో చేరిన బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు

నవతెలంగాణ – ఆర్మూర్
నియోజకవర్గంలోని మాక్లూర్ మండల్ ధర్మారం గ్రామంలో బిఅరెస్,కాంగ్రెస్ కి చెందిన 150 మంది కార్యకర్తలు బీజేపీ నాయకుడు రాకెష్ రెడ్డి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాకెష్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ వస్తే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వస్తాయి అని బెదిరింపు రాజకీయాలు కాకుండా నిజాయితీ విలువలతో కూడిన రాజకీయం బీజేపీతో సాధ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు వినోద్, అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు,గంగోని సంతోష్, గంగారెడ్డి, సురేష్ అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Spread the love