కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త దాడి

నవతెలంగాణ – అచ్చంపేట
కాంగ్రెస్ కార్యకర్తలపై సాయిరాం కాలనీ బీఆర్ఎస్ కౌన్సిలర్ భర్త సుంకరి బాలరాజు ఆయన సోదరుడు సుంకరి లింగం లు కాంగ్రెస్ కార్యకర్తలపై కత్తితో దాడిచేసిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం. లోక్ సభ ఎన్నికల్లో ఇదే కాలనీలో కాంగ్రెస్,  బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పాత సంఘటనను గుర్తుచేసుకొని మాటువేసుకొని ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు సుంకరి బాలరాజు, సుంకరి లింగం, శనివారం సాయిరాం థియేటర్ ముందు ప్రధాన రోడ్డుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన లాలు యాదవ్, ఆంజనేయులు యాదవ్ నిల్చోని ఉన్నారు. గమనించిన టిఆర్ఎస్ నాయకులు వెనకాల నుండి కత్తితో దాడి చేశారని తెలిసింది.ఈ దాడిలో లాలు యాదవ్ తలపై బలమైన గాయమైంది. వీపుపై కాలుకు తీవ్ర గాయాలు అయ్యాయని యాలయ్యాయన బాధితులు తెలిపారు.వీరిని వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.

Spread the love