– ఉద్యమకారులపై అక్రమ కేసులు పెట్టిన ఘనత రసమయదేనని అవేదన
– అరాచకాలకు,అక్రమాలకు,దోపిడికి కేరాఫ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నని అసహనం
– ఉద్యమకారుల మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని స్పష్టీకరణ
నవతెలంగాణ-బెజ్జంకి: తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన ఉద్యమకారుల ఆశయాలను రాష్ట్రంలో పరిపాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం బొంద పెట్టిందని తెలంగాణ ఉద్యమకారుల పెడరేషన్ (టీయూఎఫ్) కరీంనగర్ జిల్లాధ్యక్షుడు కనకం కుమార స్వామి అగ్రహం వ్యక్తం చేశారు..మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ ఉద్యమకారుడు. జేరిపోతుల మధు అధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుమార స్వామి మాట్లాడారు..మండల పరిధిలోని రేగులపల్లి గ్రామంలో సుమారు 20 ఎకరాల భూమి అంశాన్ని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కుట్రపూరితంగా వ్యవహరించి తన అనుచరులతో బెజ్జంకి పోలీస్ స్టేషన్ యందు అక్రమ కేసు పెట్టించి పోలీసులతో చిత్ర హింసలకు గురిచేయించాడని అవేదన వ్యక్తం చేశారు. అరాచకలకు, అక్రమాలకు, దోపిడికి మానకొండూర్ నియోజకవర్గాన్ని కేంద్రంగా మార్చుకుని తెలంగాణ ఉద్యమకారులను అణచివేతకు గురిచేశారని అసహనం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని పెన్షన్ అందుకుంటున్న వృద్ధులు, వికలాంగుల ఓట్లనే నమ్ముకుని మిగతా ఓటర్లను డబ్బుతో ప్రలోభ పెట్టి మళ్లీ అధికారం చేపట్టాలని శాయశక్తుల యత్నాలు మొదలు పెట్టాడని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలు ప్రలోభాలకు గురై ఎమ్మెల్యే రసమయికి ఓటేస్తే సమాజంలోని ప్రజలు గడ్డుదుస్థితిని ఎదుర్కొనడంతో పాటు ప్రజాధనం మరింత దోపిడికి గురై ప్రశ్నించిన వారు అక్రమ కేసుల పాలవుతారని విజ్ఞప్తి చేశారు.ఉద్యమకారుల ఆశయాలను గుర్తించిన పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఉద్యమకారుల ఫెడరేషన్ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని స్పష్టం చేశారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే రాష్ట్ర ప్రజలందరికి సమన్యాయం జరుగుతుందని మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కవ్వంపల్లి సత్యనారాయణకు ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో భాగాస్వాములై మార్పుకు నాంది పలకాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.ఉద్యమకారులను,యువతను అణిచివేసి స్థానిక ఉద్యోగాలను తన అనుగుణంగా ఉండే వారికి కట్టబెడుతూ మండల వాసులకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఈ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని జేరిపోతుల మధు విజ్ఞప్తి చేశారు.అనంతరం మండల కేంద్రంలో వృద్ధులను కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయ్యాలని ఉద్యమకారులు అభ్యర్థించారు. శానగొండ శరత్.తాటిపెల్లి శంకర్,మామిడి మొగిలి,కనకం విద్యాసాగర్, పరకాల పర్శీ,భూతల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.