– అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి
– అంగన్వాడీ సంఘాలతో చర్చలు జరపాలి
– సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె ఉధతం
– సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ.మల్లేశం
నవతెలంగాణ – మెదక్
‘బీఆర్‌ఎస్ నియంతపాలన వీడాలి. అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి. అంగన్వాడీ సంఘాలతో చర్చలు జరపాలి. సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె ఉధతం చేస్తాం’ అని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ.మల్లేశం అన్నారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైందని అసహనం వ్యక్తం చేశారు. మెదక్ ఆర్డీవో కార్యాలయం ఎదుట తొమ్మిదో రోజు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మెలో మంగళవారం మల్లేశం మాట్లాడుతూ అంగన్వాడీలు తమ న్యాయమైన హక్కుల సాధన కోసం సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలను ప్రయోగించి టీచర్లు, హెల్పర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ టీచర్లు రిటర్మెంట్ అయితే రూ. 2 లక్షలు, ఆయాలకు రూ. 1 లక్ష చొప్పున బెనిఫిట్స్ ఇవ్వాలని, రిటైర్మెంట్ వయసును 65 సంవత్సరాలకు పెంచుతూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా నెలవారీ వేతనం రూ. 26 ఇవ్వలని గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం నియంతల పాలన కొనసాగిస్తుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు, ఉద్యోగులు తమ హక్కుల సాధన కోసం సమ్మె చేస్తే చర్చలు జరపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండాలన్నారు. ఇప్పటి వరకు అంగన్వాడీల. డిమాండ్ లను పరిష్కరించాలని శాంతియుతంగా ఆందోళనలు చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడి సంఘాలతో చర్చలు జరపాలని, లేనిపక్షంలో సిఐటియు ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదతం చేసి దశల వారీగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయనున్నట్లు వెల్లడించారు. అంగన్వాడి నాయకులు రాజ్యలక్ష్మి, శ్రీలక్ష్మి, స్వరూప, రిబ్క, భాగ్య తదితరులు ఉన్నారు.