బీఆర్‌ఎస్‌ మహిళా కౌన్సిలర్‌ ఆత్మహత్య

-ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పరామర్శ
నవతెలంగాణ -మిర్యాలగూడ
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని 24వ వార్డు కౌన్సిలర్‌ కుందూరు నాగలక్ష్మి(40) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. టూ టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌, శివాని విద్యాసంస్థ ప్రిన్సిపాల్‌ కుందూరు నాగలక్ష్మి(40) శుక్రవారం తన నివాసంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటివరకు ఆత్మహత్య గల కారణాలు తెలియరాలేదు. స్థానికుల సమాచారం మేరకు సీఐ నర్సింహారావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. నాగలక్ష్మికి భర్త శ్యాంసుందర్‌ రెడ్డి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో ఉంది.
గురువారం రాత్రి ఏం జరిగింది..
గురువారం రాత్రి కుందూరు శ్యాంసుందర్‌రెడ్డి, నాగలక్ష్మి పట్టణంలో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరై పొద్దుపోయే సమయానికి ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగినట్టు సమాచారం. ఆ సమయంలో నాగలకిë బెడ్‌ రూమ్‌లోకి వెళ్లి తలుపులేసుకున్నారు. కుమార్తె ఎంత పిలిచినా తలుపు తీయకపోవడంతో భర్త, కుమార్తె ఇద్దరూ హాల్‌లోనే నిద్రించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం తలుపు తీయాలని కూతురు పలు మార్లు కోరినా ఎలాంటి స్పందనా రాకపోవడంతో వాచ్‌మెన్‌ తలుపులు పగుల గొట్టి చూడగా.. నాగలకిë విగతజీవిగా కనిపించినట్టు స్థానికులు చెప్పారు.

Spread the love