మహేశ్వరంలో బంజార భవన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
నవతెంగాణ-మహేశ్వరం
గిరిజనులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం సేవాలాల్ దేవాలయ చైర్మెన్ సీతారాం,చౌహన్, వైస్. ఎంపీపీ సునితా ఆంధ్యానాయక్ ఆధ్వర్యంలో మహేశ్వరం మండల గిరిజన నాయకులు మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నగరంలోని ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలం గాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గిరిజనులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని ఆన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చి గిరి జనులకు స్వయం పాలనను అందిస్తున్నారని అన్నారు. త్వరలోనే గిరిజన బంధును ప్రవేశపెడుతున్నారని ఆమె తెలి పారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పధకాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి గడపకు లబ్దిచేకూ రుతోందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దేశ రాజకీయాలలో సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ఇతర రాష్ట్రాలు కోరుకుంటున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని తెలిపారు.కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ఈశ్వరానాయక్, వైస్.ఎంపీపీ సునీత అంధ్యానాయక్, తుక్కుగూడ కౌన్సిలర్ బాదావత్ రవినాయక్, సర్పంచ్‌లు మెగావత్ రాజునాయక్, సాలివీరానాయక్, మోతీలాల్ నాయక్, రాజునాయక్, నాయకులు కృష్ణనాయక్, విఠలానాయక్, పాండునాయక్, ఉపసర్పంచ్ దేవేందర్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్ నాయక్, సెక్రటరీ రవినాయక్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు గోపాల్‌నాయక్, జగన్‌నాయక్, రవినాయక్, రాందాసానాయక్, సూర్య నాయక్, హర్యనాయక్, తుల్చనాయక్, తదితరులు పాల్గొన్నారు.