గుంటూరులో ప్రారంభోత్సవం చేసిన ఆ పార్టీ రాష్ట్రఅధ్యక్షుడు తోట చంద్రశేఖర్
గుంటూరు: గుంటూరులో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఆదివారం ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అభివృధ్ధిలోకి తీసుకెళ్లారని కొనియాడారు. దేశంలో బీజేపీని ఎదుర్కోగల నేత కేసీఆర్ మాత్రమేనన్నారు.ఏపీ ప్రజలు టీడీపీ, వైసీపీ పాలనతో విసిగిపోయారన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీలు కక్షలు, కార్పణ్యాలతో రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఏపీ ప్రజలు సమస్యలతో సతమతమ వుతున్నారన్నారు. మోడీని ప్రశ్నించే దమ్ము వైసీపీ, టీడీపీలకు లేదన్నారు. ఇక్కడి పార్టీలు మోడీకి గులాంగిరీ చేస్తున్నాయన్నారు. దక్షిణ భారత దేశంలో ప్రధాని కాగల నాయకుడు కేసీఆర్ మాత్రమేనని ఆయన అన్నారు.