బీఆర్ఎస్ భారీ షాక్…!

– తెలంగాణ ఉద్యమబిడ్డ ప్రముఖ ఎన్ఆర్ ఐ కారుకు గుడ్ బై
– త్వరలో కాంగ్రెస్ లో చేరిక
– 9ఆయనతో పాటు మరో పలువురు యువనేతలు
నవతెలంగాణ -పెద్దవూర : ఎన్నికలు దగ్గర పడుతున్న సమయం లో ప్రముఖ ఎన్ఆర్ఐ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,తెలంగాణ ఉద్యమకారుడు త్వరలో ఆ పార్టీకి గుడ్ బై చెప్ప చె నున్నట్లు సమాచారం. ఆయన ఎవరో కాదు నల్గొండ జిల్లా, నాగార్జున సాగర్ నియోజకవర్గం, పెద్దవూర మండలం పులిచర్ల గ్రామానికి చెందిన జి ఆర్ ఆర్ పౌండష్ ఛైర్మెన్ గడ్డంపల్లి రవీందర్ రెడ్డి, తెలంగాణ మలిదశ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు, మంత్రి కేటీఆర్ కు మంచి గుర్తున్న స్నేహితుడు కావడం విశేషం. త్వరలో నాగార్జున సాగర్ నియోజకవర్గం కీలక నాయకులు అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లు నియోజకవర్గం లో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ రాష్ట్ర కీలక నాయకులతో కూడ చర్చలు జరిపినట్లు తెలిసింది. మరో ఆరు రోజులైతే ఎన్నికల ప్రచారం, ముస్తుంది. ఈ సమయంలో అతను కారు దిగి హస్తం గూటికి చేరుతుండడం తో కారుకు బ్రేక్ పడినట్లు అయింది. ఆయన త్వరలో ముఖ్య అనుచరులతోపాటు కలిసి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. యువతతో మంచి క్రేజ్ ఉన్న నాయకుడు కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.
– పలు సేవా కార్యక్రమాలు
నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా రవీందర్ రెడ్డి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆయన అందరికి సుపరిచితుడే. ఏవరికి ఆపద వచ్చినా నేనున్నా అంటూ ముందుంకు వచ్చి అండగా నిలిచే నాయకుడు అలాంటి నాయకుడు కారుదిగి పోతుండడం తో గులాబీ శ్రేణుల్లో గుబులు పుడుతుంది. నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుడిగా అయనకు పేరుంది. అమెరికాలో ఉంటూ తాను జన్మనిచ్చిన నియోజకవర్గానికి గత 15 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన జీఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో కూడా సేవా కార్యక్రమాలు చేపట్టి అందరి చేత శభాష్ అనిపించు కున్నారు. తన ఫౌండేషన్ ద్వారా పెళ్లి కానుకగా పెళ్ళి చేసుకుంటున్న ఆడపడచులకు తన గిఫ్ట్ గా ఎంతో మందికి రూ.5,000 అందజేసేవారు. అలాగే యువతకు క్రికెట్ కిట్లు, క్రీడా దుస్తులు, పలుమార్లు క్రికెట్ టోర్నమెంట్లు కూడ నిర్వహించారు.

– మలిదశ ఉద్యమం లో కీలక పాత్ర
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.అమెరికాలో ఉద్యోగం వదులుకోని మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జిల్లాలోమొట్ట మొదటి సారిగా ధూందాం కార్యక్రమాలు చేపట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు.ఆయన అప్పట్లో నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించారు. అధిష్టానం ఒప్పుకోలేదు.దీంతో ఆయన కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆ తరువాత ఆయన కొంతకాలం పాటు అమెరికా వెళ్లిపోయారు. అనంతరం ఆయన అమెరికా నుంచి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంట్లో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఇటు యువత తో కూడా ఆయన మంచి క్రేజ్ ఉన్న నాయకులు కావడంతో కాంగ్రెస్ పార్టీ ప్లస్ అవుతుందనే చెప్పాలి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణం లో బీఆర్ఎస్‌ పార్టీకి ఇది కోలుకోని దెబ్బెగా భావించ వచ్చు.

Spread the love