బీఆర్ఎస్, బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు

నవ తెలంగాణ- కమ్మర్ పల్లి:
వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు సూత్రాల మహేష్ ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు వారి మిత్ర బృందానికి ముత్యాల సునీల్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ పార్టీ నాయకులు సుబ్బు, గున్నాల రాకేష్, కున్నాల దత్తు, గున్నాల రవి మరో 350మంది బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో పార్టీలో చేరిన అందరికీ ముత్యాల సునీల్ కుమార్  ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు అలుపు లేకుండా శ్రమించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love