గడపగడపకు బీఆర్‌ఎస్‌ విస్తృతంగా ప్రచారం

నవ తెలంగాణ మల్హర్ రావు: మంథని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే  అభ్యర్థి పుట్ట మదుకర్ కు ఓటువేసి  అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మండలంలోని ఎడ్లపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం గడప గడపకు విస్తృతంగా ప్రచారం చేశారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కార్డుకు ఇంటింటా పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించే పథకాలే కాకుండా పుట్ట పేదలకు సొంతగా ఆర్థిక సహయాలు, పెళ్లిళ్లు చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోట రాజేశ్వరావు, బీఆర్‌ఎస్‌ నాయకులు యాదగిరిరావు, అక్కినబోయిన  సమ్మయ్య ముధిరాజ్, పట్టి  రాజమ్మ, రౌతు భీమయ్య, పంతకాని సురేష్ , ఇండ్ల సారయ్య, మద్యాల లక్ష్మణ్, గంధం రవి, తోకల సమ్మయ్య, చెన్నవేణి తిరుపతి, పోతారజు పాల్గొన్నారు.
Spread the love