100 సీట్లు గెలవడం ఖాయం మళ్లీ బీఆర్‌ఎస్‌ దే అధికారం

ప్రతిపక్షాల మాయ మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు
సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజల సమగ్ర అభివద్ధి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాలను విజయవంతం చేయాలి
విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌
నవతెలంగాణ-మాడ్గుల
ప్రతిపక్షాలు ఎన్ని గగ్గోలు పెట్టినా బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోనికి వస్తుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 100 సీట్లు గెలవడం ఖాయమని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ అన్నారు. గురువారం బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఏమిరెడ్డి జైపాల్‌ రెడ్డి, పిఎసిఎస్‌ చైర్మన్‌ సూదిని పట్టాభి తిరుమలరెడ్డితో కలిసి విలేకరులతో ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రజలకు శాంతి భద్రతాలు, సంక్షేమం అభివద్ధి కార్యక్రమాలు, విద్య వైద్య రంగాలు, రోడ్లు భవనాలు, సాగునీరు తాగునీరు, విద్యుత్‌ వంటి ప్రధానమైన పథకాలే కాకుండా ఇతర వినూత్నమైన పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌, బిజెపి మాయ మాటలు, మోసపు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ప్రభుత్వంపై పనిగట్టుకొని చేస్తున్న విమర్శలను ప్రజలంతా గమనిస్తున్నారని ఎన్నికలప్పుడు సరైన సమాధానం చెబుతారని అన్నారు. బిజెపి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కులాలు, మతాలు మధ్య చిచ్చులు పెట్టడానికి ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. జూన్‌ 2 నుండి 22 వరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాలను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని ప్రజలంతా భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా 3న రైతు దినోత్సవం, 4న సురక్ష దినోత్సవం,5న విద్యుత్‌ విజయోత్సవం,6న పారిశ్రామిక ప్రగతి, 7న సాగునీటి దినోత్సవం, 8న ఊరూరా చెరువుల పండుగ, 9న సంక్షేమ సంబరాలు, 10న తెలంగాణ సుపరిపాలన దినోత్సవం, 11న సాహిత్య దినోత్సవం, 12న తెలంగాణ రన్‌, 13 తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం,14న తెలంగాణ వైద్య దినోత్సవం 15న తెలంగాణ పల్లె ప్రగతి, 16న తెలంగాణ పట్టణ ప్రగతి,17న తెలంగాణ గిరిజన దినోత్సవం 18న తెలంగాణ మంచినీళ్ల పండుగ, 19న తెలంగాణ హరితోత్సవం, 20న తెలంగాణ విద్యా దినోత్సవం, 21న తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం 22న తెలంగాణ అమరుల సంస్మరణ దినోత్సవం, చొప్పున 21 రోజులపాటు అత్యంత వైభవంగా తెలంగాణ రాష్ట్ర అంతట పండుగ వాతావరణం నెలకొంటుంది అన్నారు. ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
పార్లమెంటుకు అంబేద్కర్‌ పేరు పెట్టాలి
దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంటుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ పేరు పెట్టాలని ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పార్లమెంటుకు ఆయన పేరు పెట్టి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవించి రాష్ట్రపతి చేత ప్రారంబింప చేయాలని ఆయన కోరారు.

Spread the love