నవతెలంగాణ హుస్నాబాద్: హుస్నాబాద్ లో బీఆర్ఎస్, సీపీఐ నాయకులు పెద్ద సంఖ్యలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మీర్జాపూర్ సర్పంచ్ భర్త మహేందర్ తో పాటు మాజీ ఉపసర్పంచ్ తరాల కనకయ్య, ముఖ్య నాయకులు బండి వెంకట్ రెడ్డి తో సహా 50 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. పక్కన్నపేట మండలంలోని రేగొండ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కైత రాజిరెడ్డి, సీపీఐ(ఎం) నుండి మూల వెంకటరెడ్డి, బొడిగే మల్లేష్ తో సహా 20 మంది నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మల్చెరువు తండా ఉప సర్పంచ్ గుగులోతు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బానోతు మున్నా నాయక్ తో పాటు 20 మంది నాయకులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పోన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ కెడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మండల అధ్యక్షుడు బంక చందు,వెన్న రాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు.