బీఆర్‌ఎస్‌ కంచుకోట ఉమ్మడి కరీంనగర్‌

– అన్ని సర్వేలు, నివేదికల్లో స్పష్టంగా బీఆర్‌ఎస్‌ ఆధిక్యత
– ఈసారి అన్ని సీట్లలో జయకేతనం
– ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ భేటీ
నవతెలంగాణ-హైదరాబాద్‌ బ్యూరో
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ కంచుకోట అని బీఆర్‌ఎస్‌ కంచుకోట ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2001లో పార్టీ ఏర్పాటుచేసినప్పటి నుంచి తిరుగులేని ఆధిక్యంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ప్రజలు బీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. నాటి నుండి నేటి వరకూ జిల్లా ప్రజలను మమేకం చేస్తూ తీసుకున్న ప్రతీ కార్యక్రమం విజయవంతం చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ పటిష్టంగా పనిచేస్తుందనీ, తాజా సర్వేల్లోనూ, అన్ని నివేదికల్లోనూ ఈసారి ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ఎదురులేదని స్పష్టమైందని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో యాక్షన్‌ ప్లాన్‌ రూపకల్పనకు, వివిద కార్యక్రమాలు నిర్వహించేలా యాక్షన్‌ ప్లాన్‌ రూపకల్పనకుగాను మంత్రి కేటీఆర్‌ సోమవారం అందుబాటులో ఉన్న ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులతో హైదరాబాద్‌లో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…బీఆర్‌ఎస్‌ కంచుకోట ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గ్రౌండ్‌ క్లియర్గా ఉందని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో అనుసరించాల్సిన వ్యూహాంపై చర్చించి యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love