
గాంధారి మండల బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ ఎలాంటి షరతు లేకుండారైతులందరికి ఇచ్చిన హమీ ప్రకారం 2 లక్షలరుణమఫీ వేంటనే అమలుచేసి వేంటనె రైతుల ఖాతాల్లో వేయ్యలనిబి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎల్లారెడ్డి మాజీ శాసన సభ్యులు జాజాల సురేందర్ ఆదేశాల మేరకు ఈ రోజు హైదరాబాద్ లోని ప్రజా భవన్ ముట్టడి కి గాంధారి మండల బిఆర్ ఎస్ పార్టీ నాయకులు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రెడ్డి రాజులు, మాజీ మండల అధ్యక్షులు శివాజీ, బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు జింగురు సురేష్, మాజీ మండల కో- ఆప్షన్ మెంబర్ ముస్తఫా, బిఆర్ఎస్ పార్టీ గాంధారి పట్టణ అధ్యక్షులు తూర్పు సంతోష్, జువ్వాడీ బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు శ్యామ్ మరియు కార్యకర్తలు హైదరాబాద్ కు వెళ్తున్న మార్గమధ్యలో నాయకులను అరెస్ట్ చేసి స్థానిక పోలిస్ స్టేషన్ కు తరలించారు.