నవతెలంగాణ – జన్నారం
రైతు రుణమాఫీ చేయాలని ప్రజా భవన్ ముట్టడికి వెళ్తున్న తెలంగాణ ఉద్యమకారుడు కమ్మల విజయధర్మను పోలీసులు అరెస్టు చేయగా, గురువారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్కు వెళ్లి జన్నారం టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయనను పరామర్శించారు. అతనికి మద్దతు ప్రకటించారు. అక్రమంగా అరెస్టు చేసిన రైతులను ఉద్యమకారులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సిటీ మల భరత్ కుమార్, ఫజల్ ఖాన్, సులువ జనార్ధన్, బాలసాని శ్రీనివాస్ గౌడ్ ఒల్లాల నరస గౌడ్, తదితరులు పాల్గొన్నారు.