మేడిగడ్డ సందర్శనకు బయల్దేరిన బీఆర్‌ఎస్‌ నేతలు

నవతెలంగాణ – హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లపై ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. ఇందులో భాగంగా బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల బృందం మేడిగడ్డను సందర్శించనుంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌ నుంచి పార్టీ ఎమ్మెల్యేలు, శాసనమండలి, పార్లమెంట్‌ సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు ప్రత్యేక బస్సుల్లో మేడిగడ్డకు బయల్దేరారు. వారితోపాటు సాగునీటిరంగ నిపుణులు కూడా ఉన్నారు. మేడిగడ్డ పరిశీలన తర్వాత అన్నారం బరాజీని పరిశీలించనున్నారు. అన్నారం వద్ద పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టనున్నారు. ప్రజలకు వాస్తవాలను వివరించనున్నారు.

Spread the love